
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) గడువు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జూలై 24వ తేదీ వరకూ SIR (Special Intensive Revision) గడువు పెంచింది. వాస్తవానికి నేటితో (జులై 14) ఎస్ఐఆర్ గడువు ముగియనుంది. అయితే ఎస్ఐఆర్ గడువు పొడిగించాలంటూ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో జూలై 24వ తేదీ వరకూ ఎస్ఐఆర్ గడువు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేయనుంది. జూలై 31వ తేదీ నుంచి ఆగస్ట్ 30వ తేదీ వరకూ ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇచ్చింది. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి అభ్యర్థనతో సవరించిన కొత్త షెడ్యూల్ వెల్లడించింది. #andhrapradesh #electioncommissionofindia #royalcityvijayawada #vote #vijayawadadiaries
This post was published on 14th July, 2026 by Royalcity on his Instagram handle "@royalcity_vijayawada (Royalcity Vijayawada)". Royalcity has total 148.2K followers on Instagram and has a total of 3.1K post.This post has received 334 Likes which are lower than the average likes that Royalcity gets. Royalcity receives an average engagement rate of 4.93% per post on Instagram. This post has received 0 comments which are lower than the average comments that Royalcity gets. Overall the engagement rate for this post was lower than the average for the profile. #andhrapradesh #royalcityvijayawada #electioncommissionofindia #vijayawadadiaries #vote has been used frequently in this Post.